ఆర్టీఐ రక్షక్ ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియచేసిన – ఆర్టీఐ సతీష్
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని ఆర్టీఐ రక్షక్ రాష్ట్ర కార్యాలయంలో ఆర్టీఐ రక్షక్ సంస్థ యొక్క ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్ గారితో కేక్ కట్ చేయించి సంస్థ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్టీఐ సతీష్ గారు మాట్లాడుతూ సంస్థ ఏర్పాటై రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆర్టీఐ రక్షక్ సభ్యులకు మరియు సమాజంలో సామాజిక బాధ్యతగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తో పోరాడుతున్న ఆర్టీఐ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్టీఐ రక్షక్ సంస్థ తరపున ప్రతి జిల్లాలో సమాచార హక్కు చట్టం పై అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలను చైతన్య పరుస్తామని వారు అన్నారు.. సమాచార హక్కు చట్టం పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వీడి సమాచార కమిషనర్ లను నియమించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. అనంతరం చౌటుప్పల్ మండలం జాయింట్ సెక్రటరీగా ఊదరి శ్రీకాంత్ ని నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రోశనగరి యాదయ్య ,లందగిరి సాయి, బుగ్గ రాములు ,ఐతరాజు అశోక్, కత్తుల రవి, తదితరులు పాల్గొన్నారు..






