జస్టిస్ యాక్సెస్ నెట్వర్క్ ఆద్వర్యంలో “సమాచార హక్కు చట్టం మరియు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం “. పై ఒక్కరోజు వర్క్ షాప్
15-06-2025 ఆదివారం రోజు హైదరాబాద్ సూర్య లోక్ కాంప్లెక్స్, అబిడ్స్ లో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథి ఆర్.టి.ఐ కమీషనర్ దేశాల భూపాల్ గారు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం, ప్రభుత్వం చేపట్టే ప్రతి పని పారదర్శకంగా, జవాబుదారీతనం తో జరుగుతుందో లేదో తెలుసుకోవడానికి సామాన్యుడి చేతిలో ఆయుధంగా పనిచేస్తుందని చెప్పారు. ఈ జన్ నెట్వర్క్ ద్వారా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని, ప్రతి జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. అంతే కాక ప్రభుత్వ బాధ్యతగా సమాచారం హక్కు చట్టం కార్యకర్తల పిటీషన్లకు సరైన సమాధానాలు వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ చట్టంలోని విది విధానాలపై వక్తగా ఆర్టిఐ రక్షక్ గౌరవ అధ్యక్షులు, విజిల్ బ్లోయర్ అష్రఫ్ అహ్మద్ గారు మాట్లాడుతూ 40 వేలకు పైగా పెట్టిన పిటీషన్ల గురించి వివరించారు. మరో వక్త హైకోర్టు అడ్వకేట్ చింతల శ్రీకాంత్ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ఏవిధంగా వేయాలి, ఎటువంటి సమాచారం పొందుపరచాలనే విషయాలను వివరించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా వ్యవహరించిన ప్రొఫెసర్ రామకృష్ణ కొలికిపోగు మాట్లాడుతూ సమాజం బాగుండాలని, అందరికీ సమాన హక్కులు, సమగ్ర అభివృద్ధి చేరాలన్నా, అవినీతి నిర్మూలన జరగాలన్నా జస్టిస్ యాక్సెస్ నెట్వర్క్ సభ్యులంతా ఐక్యంగా పనిచేయాలన్నారు.త్వరలో అన్ని జిల్లాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సమాచార హక్కు చట్టం పై అవగాహన కలిగి ఉండలన్నారు. ఆర్టీఐ కార్యకర్తలు వేసే అప్లికేషన్స్ ప్రజా ప్రయోజనాలు కలిగి ఉండేలా సమాజానికి ఉపయోగపడేలా ఉండాలన్నారు. ఈ కార్యక్రమాన్ని అమెరికా నుంచి డా మహేష్ బండ తో పాటు, కె నరేందర్, బి సురేష్, మరియు వి ఐలేష్ కోఆర్డినేటర్లుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కండె వెంకట్, రోశనగరి యాదయ్య, సాయి కిరణ్, పెద్దయెత్తున సభ్యులు పాల్గొన్నారు.






