యాదాద్రి జిల్లా రామన్నపేట మండల తహశీల్దార్ కార్యాలయం లో ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్ పనిపై వెళ్లగా అక్కడ కార్యాలయంలో అందరికి ఎదురుగా కనబడేవిధంగా ఉండాల్సిన సమాచార హక్కు చట్టం బోర్డు కనడలేదు. కార్యాలయంలో మొత్తం తిరిగి పరిశీలించి చూడగా రిజిస్ట్రేషన్ రూంలో కుర్చీ పక్కన ఒక మూలకు పెట్టారు. ఆ బోర్డు పై ప్రస్తుత పీఐఓ ,అప్పీలేట్ అధికారుల పేర్లు ఫోన్ నంబర్స్ కూడా మార్చకుండా సంవత్సరకాలం నుండి పట్టిచుకోకుండా అధికారులు నిర్లక్ష్యం గా బోర్డు ను కుర్చీల పక్కన మూలకు పడేసారు. ఇప్పటికైనా అధికారులు సమాచార హక్కు చట్టం పై నిర్లక్ష్యపు నీడ ను వీడనాడాలని ఆర్టీఐ సతీష్ కోరారు. వెంటనే సమాచార హక్కు బోర్డు ను తిరిగి అందరికి కనబడేవిధంగా ఏర్పాట్లు చేయాలని అలాగే ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయాలలో కూడా సమాచార హక్కు చట్టం బోర్డు లు అందరికి కనబడేవిధంగా జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలో సమాచార హక్కు బోర్డులు ఏర్పాట్లు చేయాలని వారు కోరారు.






