పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూరేళ్ల విఠలాచార్య గారిని సన్మానించిన ఆర్టీఐ రక్షక్ టీం

పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూరేళ్ల విఠలాచార్య గారిని సన్మానించిన ఆర్టీఐ సతీష్

యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డా.కూరేళ్ల విఠలాచార్య గారిని ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్ మరియు సంస్థ సభ్యులు
ఆచార్య కూరేళ్ల గ్రంథాలయం నందు సన్మానించడం జరిగింది. ఆర్టీఐ సతీష్ మాట్లాడుతూ గురువులు కూరేళ్ల విఠలాచార్య గారు మా సొంత గ్రామం కావడం ఎంతో సంతోషంగా ఉన్నదన్నారు.
తెలుగు రచయిత, విశ్రాంత ఉపన్యాసకులు, సామాజిక వేత్త, ఆచార్య కూరేళ్ల గ్రంథాలయ స్థాపకుడు. సాహిత్యమే ఊపిరిగా ఐదు దశాబ్దాలుగా రచనలు సాగిస్తున్నాడు. కవిగా 22 పుస్తకాలను వెలువరించిన విఠలాచార్య, పదవీ విరమణ అనంతరం తన స్వగ్రామంలోని తన గృహంలో సుమారు రెండు లక్షల గ్రంథాలతో గ్రంథాలయం ఏర్పాటు చేశాడు. కలలను నిజం చేసుకోవడానికి వయస్సు అడ్డుకాదని 86 సంవత్సరాల కూరేళ్ల విఠలాచార్య మనందరికీ ఆదర్శం అన్నారు. ఇప్పుడున్న యువత విఠలాచార్య గారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీఐ రక్షక్ సభ్యులు రోశనగరి యాదయ్య, కళ్లెం ధర్మనీల, కోట సుధాకర్, కొండ మల్లేశం, లవణం ఉపేందర్, సిరా మహేష్, గంధమల్ల శ్రీనివాస్ , కోళ్ల సైదులు , రవి, రమేష్, శ్రీకాంత్ ,ఆవనగంటి స్వామి, తాటిపాముల స్వామి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ఏఐ రంగంలో భారత్ సంచలనం

ఏఐ రంగంలో భారత్ సంచలనం: ChatGPT, Geminiలకు గట్టి పోటీ ఇస్తున్న Sarvam AI RTI SATISH: బెంగళూరు: ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ మరోసారి తన సామర్థ్యాన్ని చాటింది. ఇప్పటివరకు ఏఐ అంటే అమెరికా, చైనా ఆధిపత్యమే అన్న…

Continue reading
నిర్వీర్యమవుతున్న ప్రజాస్వామ్య ఆయుధమా?

  సమాచార హక్కు చట్టం: అధికారుల చేతుల్లో నిర్వీర్యమవుతున్న ప్రజాస్వామ్య ఆయుధమా? RTI SATISH: ప్రత్యేక కథనం ప్రజాస్వామ్యంలో పాలకులు యజమానులు కారు — ప్రజలే అసలైన యజమానులు. కానీ ఆ యజమానులే ప్రశ్నలు అడిగితే, సమాధానాలు దాచిపెట్టే పరిస్థితి ఎందుకు…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఏఐ రంగంలో భారత్ సంచలనం

ఏఐ రంగంలో భారత్ సంచలనం

నిర్వీర్యమవుతున్న ప్రజాస్వామ్య ఆయుధమా?

నిర్వీర్యమవుతున్న ప్రజాస్వామ్య ఆయుధమా?

ఆర్టీఐ మరియు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం

ఆర్టీఐ  మరియు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం

ఆర్టీఐ రక్షక్ ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియచేసిన – ఆర్టీఐ సతీష్

ఆర్టీఐ రక్షక్ ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియచేసిన – ఆర్టీఐ సతీష్

రామన్నపేట తహశీల్దార్ కార్యాలయంలో నిర్లక్ష్యంగా మూలకు పడేసిన సమాచార హక్కు బోర్డు

రామన్నపేట తహశీల్దార్ కార్యాలయంలో నిర్లక్ష్యంగా మూలకు పడేసిన సమాచార హక్కు బోర్డు

పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూరేళ్ల విఠలాచార్య గారిని సన్మానించిన ఆర్టీఐ రక్షక్ టీం

పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూరేళ్ల విఠలాచార్య గారిని సన్మానించిన ఆర్టీఐ రక్షక్ టీం