యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పీపల్ పహాడ్ గ్రామస్థురాలు కానుగు అండాలుకు భర్త చనిపోయిన కూడా గత నాలుగు సంవత్సరాలుగా పెన్షన్ కోసం కార్యలయాలలో మోర పెట్టుకున్న నాకు పెన్షన్ రావట్లేదని గ్రామంలో, మండల కార్యాలయంలో అధికారుల చుట్టు తిరిగిన ఎక్కడికెళ్లినా తన పెన్షన్ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆర్టీఐ రక్షక్ సంస్థ సభ్యులు రోశనగరి యాదయ్య ,బుగ్గరాములుకు తన బాధను చెప్పుకోవడం జరిగింది.

తన యొక్క బాధను ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే తను స్పందించి ఆమెకు గత నాలుగు సంవత్సరాలుగా పెన్షన్ ఎందుకు రావట్లేదని ఆగష్టు 28 వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత శాఖకు ఆర్టీఐ దరఖాస్తును కానుగుల అండాలు చేత వేయించడం జరిగింది. ఆర్టీఐ రక్షక్ దరఖాస్తు లెటర్ చూడగానే వెంటనే స్పందించి కానుగుల అండాలు యొక్క పెన్షన్ సెర్ప్ కార్యాలయంలో పెండింగ్ ఉండడంతో పరిశీలించి ఉన్నతాధికారులు వెంటనే సమస్యను పరిష్కరించి పెన్షన్ ఈ నెల అమలు చేస్తున్నట్లు సెర్ప్ కార్యాలయం నుండి సమాచారం అందచేశారు. గత నాలుగు సంవత్సరాలుగా రాని పెన్షన్ ను సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్టీఐ రక్షక్ సంస్థ కృషితో అండాలు కు పెన్షన్ సెప్టెంబర్ 28 వ తేదీన ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్ మరియు ఆర్టీఐ రక్షక్ టీం చేతుల మీదుగా పీపాల్ పహాడ్ గ్రామంలో కానుగుల అండాలుకు 2016 రూపాయల పెన్షన్ ను అందచేయడం జరిగింది. ఈ విషయంపై ఆర్టీఐ సతీష్ మాట్లాడుతూ కానుగుల అండాలుకు ఆర్టీఐ రక్షక్ సంస్థ అండగ ఉండి తన సమస్యను అధికారుల దృష్టి కి తీసుకెళ్లగానే వెంటనే పరిష్కరించిన సెర్ప్ కార్యాలయ అధికారులకు జిల్లా అధికారులకు ధన్యవాదాలు తెలియచేశారు. నేడు సమాచార హక్కు చట్టం ద్వారా సమస్యలను ఎలా పరిష్కారం చేసుకోవచ్చో ఈ సమస్య ఒక ఉదాహరణ అని వారన్నారు. నా పెన్షన్ సమస్య పరిష్కారానికి కృషి చేసిన సహకరించిన అధికారులకు మరియు ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్ గారికి, చౌటుప్పల్ మండల కమిటీ సభ్యులు రోశనగరి యాదయ్య, బుగ్గరాములు, కోళ్ల సైదులు, అంజయ్య గారికి మరియు వలిగొండ మండల అధ్యక్షుడు ఐతరాజు అశోక్ ,ఆర్టీఐ రక్షక్ టీం కి కానుగుల అండాలు ధన్యవాదాలు తెలియచేశారు.









అకారణంగా 4 సంవత్సరాల నుండి కానుగుల అండాలు అప్లికేషన్ పెండింగ్ పెట్టి అప్పటి నుండి నేటి వరకు ఆమెకు ప్రభుత్వం నుండి (12×2016 =24192) ( 24192×4=96768) 96768 రూపాయలు నష్టం జరిగింది. చిన్న కారణం ద్వారా నష్టపోతే ఇంకా మనకు తెలియనివి ఎన్ని ఉండాలి…సరే ఎది ఏమైనా మన RTI రక్షక్ టీం ద్వారా ఇప్పటికైనా న్యాయం జరిగింది… ఆమె రావాల్సిన పెన్షన్ కోసం పోరాడిన మన RTI రక్షక్ టీం సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను🙏🙏🙏
ప్రతీ ఒక్క RTI-RAKSHAK సభ్యులు సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని అలాగే మన టీంని ముందుకు తీసుకెళ్లేందుకు సహాయ సహకారాలు అందించాలని నా యొక్క మనవి ***®️TI***👍📚🏪