Rtisatish:- యాదాద్రి జిల్లా సమాచార హక్కు చట్టం 2005 వ సంవత్సరం లో అక్టోబర్ 12వ తేదీన ప్రజలకు అందుబాటులోకి ఈచట్టం అమలులోకి వచ్చింది. నేటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 19వ సంవత్సరం లోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆర్టీఐ రక్షక్ టీం ఆధ్వర్యంలో చౌటుప్పల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో పేషేంట్లకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్ ,రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ రాపోలు లింగస్వామి హాజరయ్యి డాక్టర్ల చేతుల మీదుగా పండ్లు పంపిణీ చేశారు. ఆర్టీఐ సతీష్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ఏర్పడి 18 సంవత్సరాలు పూర్తి అయిన నేటికి ప్రభుత్వాలు ప్రజలు అడిగిన దరఖాస్తులకు సమాచారాన్ని ఇవ్వకుండా కాలయాపన చేస్తూ రాష్ట్ర కమిషనర్లు లేక రాష్ట్ర సమాచార కమిషన్ లో కొన్ని వేల కేసులు పెండింగ్ లో పెట్టి చట్టానికి ఉన్న లక్ష్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ఈ చట్టం అమలుకు ఆర్టీఐ కార్యకర్తలు కృషి చేస్తున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు కార్యకర్తలను భయపెట్టి అక్రమ కేసులు పెట్టి మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు సమాచార హక్కు చట్టం లోని పారదర్శకత జవాబుదారీతనాన్నీ పాటించాలని కోరారు. చట్టం యొక్క ముఖ్య లక్ష్యాలను ప్రభుత్వాలు నెరవేర్చాలని లేనిచో ఆర్టీఐ కార్యకర్తలు ప్రభుత్వాలపై తిరుగుబాటు చేసి చట్ట సభలలో న్యాయ స్థానాల్లో సమాచార హక్కు చట్టం లోని సెక్షన్ లను కాపాడుకుంటామని అలాగే ఆర్టీఐ చట్టం పై ఉన్న సమస్యలను చట్ట సభలలో ప్రశ్నించి ,పరిష్కరించే విధంగా ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి చేసి ఆర్టీఐ రక్షక్ టీం ద్వారా పోరాడుతామని ప్రతిజ్ఞ చేస్తున్నామన్నారు..
ఈ కార్యక్రమంలో ఆర్టీఐ రక్షక్ టీం రోశనగరి యాదయ్య, బుగ్గరాములు, ఐతరాజు అశోక్ , కత్తుల రవీందర్, వనం విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.







