Delhi High court Judgements
మన దేశంలో ఎక్కువగా తల్లిదండ్రుల ఆస్తులపై కొడుకులకే హక్కు ఉంటుందని భావిస్తూ ఉంటాం. ఒకవేళ కొడుకులు లేకుంటే కూతుర్లకు వర్తిస్తుందని అంటారు. కానీ ఈమధ్య కాలంలో చాలా కోర్టులు తండ్రి ఆస్తులలో, కొడుకులతో సమానంగా బిడ్డలకు కూడా ఉంటుందని తీర్పునిచ్చాయి. బిడ్డలకు ఉంటుంది కానీ అలాంటి వారికి మాత్రం తండ్రి ఆస్తులు భాగం ఉండదని ఈరోజు ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. మరి ఎవరికి ఉండదో, ఇప్పుడు తెలుసుకుందాం..
తల్లిదండ్రులు బిడ్డకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపిన తర్వాత భర్త చనిపోయి వితంతువురాలైన మహిళకు అలాగే పెళ్లి కానటువంటి కూతుర్లకు చనిపోయిన తండ్రి ఆస్తిపై హక్కు ఉంటుందని ఇప్పటికే ప్రభుత్వాలు తెలియజేస్తున్నాయి. ఇదే తరుణంలో పెళ్లి తర్వాత భర్త నుంచి విడాకులు తీసుకున్నటువంటి కూతుళ్లకు ఆస్తిలో హక్కు ఉండదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేస్తూ తీర్పునిచ్చింది.
ఎందుకంటే హిందూ అడాప్షన్, మెయింటెనెన్స్ చట్టం ప్రకారం విడాకులు తీసుకున్నటువంటి మహిళలు డిపెండెంట్ కాదని, వారికి వాళ్ళ భర్త నుంచి ఎంతో కొంత భరణం కింద వస్తుందని పేర్కొంది. కాబట్టి విడాకులు తీసుకునే మహిళలు తండ్రి ఆస్తిపై హక్కును వదులుకోవాలని తెలియజేసింది.
#rtisatish







