RTI చట్టం పై అవగాహన

Rti act information, Telangana State information commission,

Right to information act india

సమాచార హక్కు చట్టం ౼2005 గురుంచి ప్రతి ఒక్కరికి అవగాహనా కలిగి ఉండాలి

సమాచార హక్కు చట్టం ఇది చాలా కీలకమైన చట్టం. ప్రభుత్వ కార్యాలయాల నుంచి మనకు అవసరమైన ఏ సమాచారం పొందాలన్నా అలా పొందడానికి హక్కుగా కల్పించిన చట్టమే ఈ సమాచార హక్కు చట్టం దీనిపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలి.

2005 సంవత్సరంలో వచ్చిన ఈ చట్టం ఇప్పటివరకు ఎన్నో ఒడిదుడుకులకు లోనైనాప్పటికీ ఈ చట్టం ఇప్పటికీ కూడాఅన్ని రాష్ట్రాల్లో అమలులో ఉంది.
ఈ చట్టాన్ని వినియోగించుకొని చాలామంది ప్రజలు తమకు అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వ కార్యాలయాల నుండి పొందగలుగుతున్నారు.
గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా భూమి రికార్డులకు సంబంధించిన సమాచారం, రికార్డులన్నీ తాసిల్దార్ కార్యాలయంలోనూ పంచాయతీ సెక్రటరీల దగ్గరో వీఆర్వో దగ్గరనో, లేక జిల్లా కలెక్టరేట్లో రాష్ట్రస్థాయిలో డైరెక్టర్ సర్వే సెటిల్మెంట్ దగ్గర ఎన్నో కీలకమైన భూమి రికార్డులు ఉంటాయి ఒకప్పుడు పంచాయతీ సెక్రెటరీ లేదా వీఆర్వో చేతిలో ఉన్న పహానిలు నకలు కావాలంటేనే నెలల తరబడి తిరగాల్సిన సందర్భం నుంచి ఈరోజు హైదరాబాద్ లో ఉన్న డైరెక్టర్ సర్వే సెటిల్మెంట్ కార్యాలయంలో ఉన్న గ్రామపటాన్ని టిపన్ పొందగలుగుతున్నామంటే ఈ సమాచార హక్కు చట్టం ద్వారానే, అదేవిధంగా వ్యవసాయ శాఖకు సంబంధించింది కావచ్చు గ్రామంలో బడికి సంబంధించి ఊర్లో రోడ్లకు,కాలువల మరమ్మతులు, గ్రామాల్లో చెరువుల పూడిక తీత దేనికి సంబంధించింది అయినా సరే సమాచారం కావాలనుకుంటే
ఇంతకుముందు ఆ సమాచారం దొరికేదే కాదు కానీ ఇప్పుడు సమాచార హక్కు చట్టం ఉండడం వలన వీటన్నిటి యొక్క సమాచారాన్ని పొందే అవకాశం ప్రతి ఒక్క పౌరుడికి సమాచారం పొందే అవకాశం వచ్చింది. కానీ దురదృష్టం ఏంటంటే చట్టం వచ్చి 18 సంవత్సరాలు కావస్తున్న సరే ఇప్పటికీ కూడా ఈ చట్టాన్ని వాడుకునే వారు ఒకటి రెండు శాతం జనాభా మాత్రమే చాలా తక్కువ మంది ఈ చట్టాన్ని దరఖాస్తు రూపంలో వినియోగించుకుంటున్నారు.
అలా వినియోగించుకున్న వారు ఎవరైతే ఆ సమాచారం కావాలని దరఖాస్తు పెడుతున్నారో ఆ దరఖాస్తు కు సమాధానం రాకపోయినా సమాచారం ఇవ్వకపోయినా
పై స్థాయికి సగం మందికి పైగా అప్పీలుకు వెళ్లడం లేదు దరఖాస్తు దారుడు ఈ చట్టాన్ని సరిగ్గా వినియోగించకుండా ఆ సమాచారాన్ని పొందలేకపోతున్నారు..

సమాచార హక్కు చట్టం కి సంబంధించిన అంశాలు ఈ వెబ్సైట్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది.. ప్రతి ఒక్కరు ఫాలో కావాల్సిందిగా కోరుతూ

చదువుకున్న వారు మారితే ఈ సమాజాన్ని మార్చడం పెద్ద సమస్య కాదు

మీ
ఆర్టీఐ సతీష్
ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు

Related Posts

ఏఐ రంగంలో భారత్ సంచలనం

ఏఐ రంగంలో భారత్ సంచలనం: ChatGPT, Geminiలకు గట్టి పోటీ ఇస్తున్న Sarvam AI RTI SATISH: బెంగళూరు: ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ మరోసారి తన సామర్థ్యాన్ని చాటింది. ఇప్పటివరకు ఏఐ అంటే అమెరికా, చైనా ఆధిపత్యమే అన్న…

Continue reading
నిర్వీర్యమవుతున్న ప్రజాస్వామ్య ఆయుధమా?

  సమాచార హక్కు చట్టం: అధికారుల చేతుల్లో నిర్వీర్యమవుతున్న ప్రజాస్వామ్య ఆయుధమా? RTI SATISH: ప్రత్యేక కథనం ప్రజాస్వామ్యంలో పాలకులు యజమానులు కారు — ప్రజలే అసలైన యజమానులు. కానీ ఆ యజమానులే ప్రశ్నలు అడిగితే, సమాధానాలు దాచిపెట్టే పరిస్థితి ఎందుకు…

Continue reading

One thought on “RTI చట్టం పై అవగాహన

  1. ఇలాంటి సమాచారం ఇంకా చాలా వరకు సామాన్య ప్రజలకు తెలియదు,సామాజిక భాధ్యతతో ఇలాంటి విషయాలు తెలియజేసే ప్రయత్నం చేద్దాం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఏఐ రంగంలో భారత్ సంచలనం

ఏఐ రంగంలో భారత్ సంచలనం

నిర్వీర్యమవుతున్న ప్రజాస్వామ్య ఆయుధమా?

నిర్వీర్యమవుతున్న ప్రజాస్వామ్య ఆయుధమా?

ఆర్టీఐ మరియు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం

ఆర్టీఐ  మరియు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం

ఆర్టీఐ రక్షక్ ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియచేసిన – ఆర్టీఐ సతీష్

ఆర్టీఐ రక్షక్ ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియచేసిన – ఆర్టీఐ సతీష్

రామన్నపేట తహశీల్దార్ కార్యాలయంలో నిర్లక్ష్యంగా మూలకు పడేసిన సమాచార హక్కు బోర్డు

రామన్నపేట తహశీల్దార్ కార్యాలయంలో నిర్లక్ష్యంగా మూలకు పడేసిన సమాచార హక్కు బోర్డు

పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూరేళ్ల విఠలాచార్య గారిని సన్మానించిన ఆర్టీఐ రక్షక్ టీం

పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూరేళ్ల విఠలాచార్య గారిని సన్మానించిన ఆర్టీఐ రక్షక్ టీం