ఆర్టీఐ రక్షక్ రాష్ట్ర కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
*భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చౌటుప్పల్ లోని రాష్ట్ర కార్యాలయంలో ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు. ప్రతి సంవత్సరం 26 జనవరి 1950 నాడు రాజ్యాంగం ఆమోదించిన జ్ఞాపకార్ధంగా దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవంను దేశంలోని పౌరులు ఎంతో గొప్పగా మరియు ఉత్సాహంతో సైనిక శక్తి , సాంస్కృతిక వైవిధ్యంతో కూడిన ప్రదర్శనలతో జరుపుకోవడం జరుగుతుంది. 1947లో వలస పాలన నుండి స్వాతంత్ర్యం పొందినప్పటికి 26 జనవరి 1950 వరకు భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు. దీని తరువాత బ్రిటిష్ డొమినియన్ నుండి భారతదేశం సార్వభౌమ ప్రజస్వామ్య రాజ్యాంగ మారిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ రక్షక్ సభ్యులు బుగ్గ రాములు , ఐతరాజు అశోక్, కోళ్ల సైదులు, అంజయ్య, వెంకటేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు







