ప్రజా పాలన కార్యక్రమంలో ఆర్టీఐ రక్షక్ సంస్థ భాగస్వామ్యం

జనవరి 06 (Rtisatish.Com)

ప్రజా పాలన కార్యక్రమంలో ఆర్టీఐ రక్షక్ సంస్థ భాగస్వామ్యం

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని పీపల్ పహాడ్ గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం ను స్పెషల్ ఆఫీసర్ శ్రీలక్ష్మీ, మండల తహశీల్దార్ హరికృష్ణ, గ్రామ సర్పంచ్ సీఎచ్ రాణి రంగారెడ్డి, ఎంపీటీసీ దోసపాటి జ్యోతి జంగయ్య, స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్ హాజరయ్యి ఆర్టీఐ రక్షక్ హెల్ప్ డెస్క్ ద్వారా గ్రామ ప్రజలకు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రజా పాలన దరఖాస్తులను ఎలా నమోదు చేసుకోవాలో స్థానికులకు వివరించి వాటిని స్వయంగా నమోదు చేసి వారికి అందించారు. ప్రభుత్వ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరు వివరాలు నమోదు చేసుకుని ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలని ఆకాంక్షించారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారిని చైతన్య పరుస్తు ముందుకు వెళ్తున్న ఆర్టీఐ రక్షక్ సంస్థ సభ్యులను మండల తహశీల్దార్ హరికృష్ణ గారు అభినందిస్తూ ఇలాంటి సామాజిక సేవ కార్యక్రమాలు ఆర్టీఐ రక్షక్ సంస్థ ద్వారా గ్రామ గ్రామాన విస్తరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ రక్షక్ టీం సభ్యులు రోశనగరి యాదయ్య, లందగిరి సాయి ,బుగ్గ రాములు, కోళ్ల సైదులు, బి.వెంకటేష్, అంజయ్య, యు. వెంకటేశం తదితరులు హాజరయ్యారు..

Related Posts

ఏఐ రంగంలో భారత్ సంచలనం

ఏఐ రంగంలో భారత్ సంచలనం: ChatGPT, Geminiలకు గట్టి పోటీ ఇస్తున్న Sarvam AI RTI SATISH: బెంగళూరు: ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ మరోసారి తన సామర్థ్యాన్ని చాటింది. ఇప్పటివరకు ఏఐ అంటే అమెరికా, చైనా ఆధిపత్యమే అన్న…

Continue reading
నిర్వీర్యమవుతున్న ప్రజాస్వామ్య ఆయుధమా?

  సమాచార హక్కు చట్టం: అధికారుల చేతుల్లో నిర్వీర్యమవుతున్న ప్రజాస్వామ్య ఆయుధమా? RTI SATISH: ప్రత్యేక కథనం ప్రజాస్వామ్యంలో పాలకులు యజమానులు కారు — ప్రజలే అసలైన యజమానులు. కానీ ఆ యజమానులే ప్రశ్నలు అడిగితే, సమాధానాలు దాచిపెట్టే పరిస్థితి ఎందుకు…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఏఐ రంగంలో భారత్ సంచలనం

ఏఐ రంగంలో భారత్ సంచలనం

నిర్వీర్యమవుతున్న ప్రజాస్వామ్య ఆయుధమా?

నిర్వీర్యమవుతున్న ప్రజాస్వామ్య ఆయుధమా?

ఆర్టీఐ మరియు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం

ఆర్టీఐ  మరియు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం

ఆర్టీఐ రక్షక్ ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియచేసిన – ఆర్టీఐ సతీష్

ఆర్టీఐ రక్షక్ ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియచేసిన – ఆర్టీఐ సతీష్

రామన్నపేట తహశీల్దార్ కార్యాలయంలో నిర్లక్ష్యంగా మూలకు పడేసిన సమాచార హక్కు బోర్డు

రామన్నపేట తహశీల్దార్ కార్యాలయంలో నిర్లక్ష్యంగా మూలకు పడేసిన సమాచార హక్కు బోర్డు

పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూరేళ్ల విఠలాచార్య గారిని సన్మానించిన ఆర్టీఐ రక్షక్ టీం

పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూరేళ్ల విఠలాచార్య గారిని సన్మానించిన ఆర్టీఐ రక్షక్ టీం